స్వయంగా ప్రధాని మోడీనే చెప్పారు.. తొందరగా చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

నిజామాబాద్‎లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని స్వయంగా ప్రధాని మోడీ హామీ ఇచ్చారని.. ప్రధాని మాటలకు అనుగుణంగా త్వరగా కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‎లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం (నవంబర్ 29) మంత్రి కోమటిరెడ్డి నిజాబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం పోయిందని తమ ప్రభుత్వంపై ఏడవద్దని బీఆర్ఎస్ నేతలకు చురకలంటించారు. రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నామని.. సంక్షేమ హాస్టళ్లలో, పేదలకు కూడా సన్న బియ్యం ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రిజినల్ రింగ్ రోడ్డు పనులు ఫిబ్రవరి లోపు ప్రారంభిస్తామని.. వచ్చే నాలుగేళ్లలో ఆర్ఆర్ఆర్ పూర్తి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు. ప్యాకేజీ 21ను త్వరలో పూర్తి చేస్తామని.. అవసరమైతే రీ టెండర్‎ను పిలుస్తామన్నారు. మాది చేతల ప్రభుత్వం కాదని.. మాట ఇచ్చినట్లుగా అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. సోనియా గాంధీ చెప్పిన విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని గుర్తు చేసిన మంత్రి కోమటిరెడ్డి.. అసలైన తెలంగాణ దీక్షా దీవస్ సోనియా జన్మదినమైన డిసెంబర్ 9వ తేదీన అని అన్నారు.