అవినీతిపరుల డెన్ బీజేపీ మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: అవినీతిపరులకు బీజేపీ డెన్ గా మారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారి నేతలకు క్రాష్‌‌‌‌‌‌‌‌  కోర్స్‌‌‌‌‌‌‌‌  నేర్పుతున్నదని, తమ కూటమి అధికారంలోకి వచ్చాక బీజేపీ అవినీతి పాఠశాలకు తాళం వేసి, ఆ కోర్సును శాశ్వతంగా మూసివేస్తామని ఆయన ట్వీట్  చేశారు. బీఆర్ఎస్  చీఫ్​ కేసీఆర్ పైనా ఆయన విమర్శలు గుప్పించారు. ఆయన పాలనలో రాష్ట్రం ఆర్థిక ఊచకోతకు గురైందని మండిపడ్డారు. పదేండ్ల పాటు ప్రజల్ని ముంచింది చాలక ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని కేసీఆర్ పై ఆయన ఫైర్  అయ్యారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం ప్రజలపై మోపిన అప్పుల భారాన్ని తగ్గిస్తున్నామని, ఆర్థిక స్థితిని క్రమంగా సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు.