పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు :  శ్రీ భక్తాంజనేయస్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన  క్రోధి నామ సంవత్సర పంచాంగాన్ని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి శుక్రవారం హైదరాబాద్​లోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. శ్రీభక్తాంజనేయస్వామి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సిరిప్రగడ శ్రీనివాసశర్మ మాట్లాడుతూ ఈనెల 7న ఉదయం 10  గంటలకు నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి ఇందిరమ్మ కాలనీలో పంచాంగం చెప్పనున్నట్లు తెలిపారు. బ్రాహ్మణులు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు, ముఖ్య సలహాదారులు రుద్రాక్షి నరసింహ తదితరులు పాల్గొన్నారు.