కేసీఆర్ కట్టింది కాళేశ్వరం కాదు..కూలేశ్వరం: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

నల్లగొండ: కేసీఆర్ కట్టింది కాళేశ్వరం కాదు..కూలేశ్వరం అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండలో జరిగిన కాంగ్రెస్ విజయోత్సవాల్లో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగం అయిన SLBC ప్రాజెక్టు ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టుకోసం మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కొట్లాడానని అన్నారు. 60 శాతం పూర్తయిన ప్రాజెక్టును బీఆర్ ఎస్ పాలనలో పెండింగ్ లో పెట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఎస్ ఎల్ బీసీ పనులు వేగంగా పూర్తి చేసి రెండేళ్లలో ప్రారంభిస్తామన్నారు. 

ALSO READ : యాదాద్రి పవర్ ప్లాంట్ వెలుగులు: యూనిట్ 2ను జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్

నల్లగొండ కాంగ్రెస్ కు కంచుకోట.. జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. జిల్లా ప్రజల అండతోనే అధికారంలోకి వచ్చాం..నల్లగొండ జిల్లాను బంగారు కొండగా మారు స్తామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేసీఆర్ గురించి మాట్లాడటం దండగా... కేసీఆర్ కట్టింది కాళేశ్వరం కాదు.. కూళేశ్వరం అని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.