BRS పెట్టిన బొక్కల పూడ్చడానికే సగం పైసలు పోతున్నయ్: మంత్రి కోమటిరెడ్డి

యాదాద్రి భువనగిరి: వచ్చే పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని.. ఆలస్యమైనా రైతులందరికీ న్యాయం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం (నవంబర్ 22) మంత్రి కోమటిరెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..- ఆలేరు పైనే మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు ఉన్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలేరుకు తాగు, సాగునీరు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశాయని ఆగ్రహం చేశారు. 

మే అధికారంలో రాగానే ఆలేరు, భువనగిరి నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చడం కోసం పెండింగ్ మిషన్ భగీరథ పైప్ లైన్ల పనుల కోసం రూ.210 కోట్లతో పనులు ప్రారంభించాని తెలిపారు. ఒకటిన్నర టీఎంసీల కెపాసిటీతో నెలన్నర రోజుల్లో గంధమల్ల రిజర్వాయర్ షురూ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆలేరు నియోజకవర్గంలో 90 చెరువులను నింపామన్నారు. ఆలేరు ప్రజలపై మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు కక్ష కట్టారో అర్థం కాలేదని అన్నారు. 

ALSO READ : నాగలి పట్టి దున్నిన మోహలా మీవి.. గుట్టలు మాయం చేసిన మీరా మాట్లాడేది : రేణుకా చౌదరి

కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 70 ఏండ్లైనా అలాగే ఉందని.. కానీ కోట్లు పెట్టి కేసీఆర్ కట్టిన మేడిగడ్డ ఏడాదికే కుప్ప కూలిందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాపై కేసీఆర్ పగపడితే అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలలో జిల్లాలో బీఆర్ఎస్‎ను ప్రజలు ఖతం చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన బొక్కలను పూడ్చడానికే సగం పైసలు పోతున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం ఇక రాదని బీఆర్ఎస్ నాయకులు భయపడి, ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండాలని ఈ సందర్భంగా సూచించారు మంత్రి కోమటిరెడ్డి.