అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌పై మంత్రి కీలక ప్రకటన

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీలో గురువారం మంత్రి శ్రీధర్ బాబు జాబ్ క్యాలెండర్‌పై కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని.. రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. శాసనసభలో  యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. 

ALSO READ : Good News : 896 బ్యాంక్ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్.. వెంటనే ఇలా అప్లై చేయండి

జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా.. అందరికీ ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని అన్నారు.  2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినా.. మరో 20 లక్షల మంది ఉపాధి లేకుండా ఉంటారని ఆయన అన్నారు. గ్రాడ్యుయేట్లలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు తక్కువగా ఉన్నాయని అసెంబ్లీలో మంత్రి తెలిపారు. మంచి ఆశయంతోనే స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నామని శ్రీధర్ బాబు వివరించారు.