మంథని పట్టణంలో అభివృద్ధిని చేతల్లో చూపిస్తున్నాం : దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు

మంథని, వెలుగు: అభివృద్ధి అనేది మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు స్పష్టం చేశారు. మంగళవారం మంథని పట్టణంలో  టీయూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐడీ నిధులు రూ.24.05కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.30 కోట్లతో రోడ్లు, డ్రైయిన్లు నిర్మాణాలు చేపట్టామన్నారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌, డంపింగ్‌‌‌‌‌‌‌‌ యార్డ్‌‌‌‌‌‌‌‌లో సేగ్రిగేషన్ షెడ్, కంపోస్ట్ షెడ్, టాయిలెట్స్,  వేయింగ్ బ్రిడ్జ్ , 9.20కోట్లతో పట్టణానికి నలువైపులా ఆర్చీలను నిర్మిస్తున్నామన్నారు. 

10 ఏండ్లలో మంథని ప్రాంతం ఆశించిన అభివృద్ధి జరగలేదని,  సీఎం, మంత్రుల సహకారంతో  మంథని నుంచి మంచిర్యాలను కనెక్ట్ చేస్తూ రూ.140 కోట్లతో గోదావరిపై బ్రిడ్జి మంజూరు చేసుకున్నామని, మంథని  పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు చెప్పారు. అనంతరం ఆలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ రమాదేవి, లీడర్లు అయిలి ప్రసాద్, శేషి భూషణ్ కాచే, చొప్పరి సదానందం, దొడ్డ బాలాజీ, ప్రసాద్ పాల్గొన్నారు.