కేసులన్నీ క్లియర్‍ చేసి నియామక పత్రాలిచ్చాం : సీతక్క

  • పోలీస్‍ అంటే రెస్పెక్ట్‍.. రెస్పాన్సిబిలిటీ
  • మంత్రి ధనసరి సీతక్క, ఎంపీ కావ్య

కరీమాబాద్‍ (మామునూర్‍), వెలుగు: రాష్ట్రంలో పోలీస్‍ కానిస్టేబుల్స్‍ రిక్రూట్‍మెంట్‍ కోసం 2022లో నోటిఫికేషన్‍ వచ్చినా రెండేళ్లుగా పెండింగ్‍లో ఉన్నాయని.. సీఎం రేవంత్‍రెడ్డి ఇచ్చినమాట ప్రకారం కోర్ట్‍ కేసులన్నీ క్లియర్‍ చేసి అందరికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారని రాష్ట్ర పంచాయతీరాజ్‍ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. గురువారం వరంగల్‍ మామునూర్‍లోని 4వ బెటాలియన్‍లో పోలీస్‍ పాసింగ్‍ ఔట్‍ పరేడ్‍ నిర్వహించారు.  9 నెలలపాటు శిక్షణ పూర్తి చేసుకున్న దాదాపు 1127 మంది సివిల్‍, ఏఆర్‍, మహిళా పోలీస్‍ కానిస్టేబుళ్లను మంత్రి సీతక్క అభినందించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  పోలీస్‍ అంటే రెస్పెక్ట్‍.. పోలీస్‍ అంటే రెస్పాన్సిబిలిటీ అన్నారు. పోలీసులవల్లే ప్రజలు స్వేచ్ఛగా ఉంటున్నారని.. ఈ క్రమంలో పోలీస్‍ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండాలన్నారు. 'మా సిస్టర్స్‍ పోలీస్‍ డ్యూటీల్లోకి రావాలనుకోవడం గ్రేట్‍ అచీవ్‍మెంట్‍' అన్నారు. ఓ మహిళగా తల్లి పాత్రతో పాటు మహిళా పోలీసులుగా ఉన్నత స్థానంలో నిలవాలన్నారు. విధుల్లో భాగంగా కొన్ని సమయాల్లో అవమానాలు ఎదురైనా అంతిమ లక్ష్యం మరువొద్దని సూచించారు. 

వరంగల్‍ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ..టెక్నాలజీ పెరిగినకొద్ది మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదన్నారు. ఈ క్రమంలో పోలీస్‍ శాఖలోనూ మహిళా శక్తి ఏంటో చూపాలన్నారు. ఓరుగల్లు రుద్రమ, సమ్మక్కసారక్కలు వీరోచితంగా పోరాడిన నేల నుంచి శిక్షణ పూర్తిచేసుకున్నవారు అదే స్ఫూర్తితో తమ ఉద్యోగాల్లో రాణించాలన్నారు.  కార్యక్రమంలో డీజీపీ అభిలాష బిస్త్‍, బెటాలియన్‍ కమాండెంట్‍ రాంప్రకాశ్‍, డీఎస్పీ రమేశ్‍,  పాల్గొన్నారు.

కాజీపేట: పోలీసులు శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, డిపార్ట్​మెంట్​ కీర్తి ప్రతిష్టలు పెంచేలా నిరంతరం ప్రజల సేవకు అంకితం కావాలని వరంగల్ పోలీసు కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్లకు పిలుపు నిచ్చారు. తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 246 మంది  స్ట్పైఫండరీ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల (సివిల్) పాసింగ్ అవుట్ పరేడ్  ను గురువారం మడికొండలోని సిటీ పోలీసు శిక్షణా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని,  ప్రజల హక్కులకు భంగం కలుగకుండా స్నేహా పూర్వకంగా వ్యవహారించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి,శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ రమణబాబు, ఏసీపీలు తిరుమల్, సురేంద్ర, అనంతయ్య పాల్గొన్నారు. 

పోలీస్‍ కీర్తి ప్రతిష్టలు పెంచాలే

  • వరంగల్‍ సీపీ అంబర్‍ కిశోర్‍ ఝా

పోలీస్‍ శాఖలో నూతనంగా విధుల్లో చేరబోతున్న కానిస్టేబుళ్లు నిరంతరం ప్రజా సేవలో ఉండటం ద్వారా కీర్తి ప్రతిష్టలు పెంచాలని వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ అంబర్‍ కిషోర్‍ ఝా అన్నారు. మడికొండలోని పోలీస్‍ శిక్షణ కేంద్రం నుంచి గురువారం 246 మంది కానిస్టేబుళ్లు ట్రైనింగ్‍ పూర్తి చేసుకున్న నేపథ్యంలో పాసింగ్‍ ఔడ్‍ పరేడ్‍ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్‍ శాఖలో క్రమశిక్షణ అనేది ముఖ్యమన్నారు. శిక్షణ సమయంలో ఉన్నట్లుగానే విధుల్లో సైతం అంతే క్రమశిక్షణతో ఉంటూ రాణించాలన్నారు. పీటీసీ ప్రిన్సిపల్‍ రవి, శ్రీనివాస్‍, వైస్‍ ప్రిన్సిపల్‍ రమణబాబు, ఏసీపీలు తిరుమల్‍ తదితరులు పాల్గొన్నారు.