జైలుకు పంపినా జన్వాడ ఫామ్‌‌హౌజ్‌‌ను కూల్చవా ? : బండి సంజయ్‌‌

రాజన్న సిరిసిల్ల, వెలుగు : ‘జన్వాడ ఫాం హౌస్‌‌ మీద కామెంట్‌‌ చేసినందుకు గతంలో రేవంత్‌‌రెడ్డిని జైలుకు పంపారు.. అయినా జన్వాడ ఫౌంహౌస్‌‌ కూల్చకపోతే ఎట్ల ? రేవంతన్నా నీ పౌరుషం ఎమైందే’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌ ప్రశ్నించారు. గురవారం సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. జన్వాడ ఫామ్‌‌హౌస్‌‌ను అక్రమ కట్టడం అని గుర్తించినా కూల్చేందుకు ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. 

అసదుద్దీన్‌‌ ఒవైసీ ఆక్రమించిన ఫల్కం చెరువు ఆక్రమణలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌ చేశారు. తన ఆక్రమణలపై చెయ్యేస్తే సంగతి చూస్తామని అసదుద్దీన్‌‌ బెదిరిస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన్నోళ్లపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. హైడ్రాను బీజేపీ వ్యతిరేకించబోదని, కానీ పెద్దలను వదిలేసి పేదోళ్లపై ప్రతాపం చూపడం సరికాదన్నారు.