గంజాయి స్మగ్లింగ్ కేసులో MIM కార్పొరేటర్ కొడుకు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు 319 కేజీల గంజాయి తరలిస్తుండగా.. భద్రాచలం వద్ద ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో నిజామాబాద్ ఎంఐఎం కార్పొరేటర్ కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. కోటి రూపాయల విలువ చేస్తే గంజాయి, 10మంది నిందితులతో పాటు రెండు కార్లు, మూడు బైకులు, తొమ్మిది సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కీలక నిందితుడుగా మునావర్ అలీని గుర్తించారు. 

మునావర్ అలీ నిజామాబాద్ ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు. పెద్దపల్లికి చెందిన అపర్ణ, అఖిల్ అనే తల్లికొడుకులు గంజాయి స్మగ్లర్లుగా మారి మునావర్ అలీకి గంజాయి సప్లై చేస్తున్నారు. నిజామాబాద్ ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు మునావర్ అలీ కోసమే గంజాయి తరలిస్తున్నట్లు తల్లి కొడుకులు ఒప్పుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడైన మునావర్ అలీపై గతంలోనూ పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.