అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీల్లో రెండు నెలలుగా పాలు బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  •  టెండర్లు ఖరారు చేయడంలో అధికారుల అలసత్వం 
  •  ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, బాలింతలు, చిన్నారులు 

మెట్ పల్లి, వెలుగు :  జగిత్యాల జిల్లాలో అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. జిల్లావ్యాప్తంగా రెండు నెలలుగా పాల సప్లై బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. దీంతోపాటు సమయానికి కోడిగుడ్లు, పప్పులు అందడం లేదు. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీలపై అధికారుల పర్యవేక్షణ లేకనే ఇలా జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. టెండర్లు ఖరారు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే పాల సప్లై బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినట్లు తెలుస్తోంది.  

రోజూ సెంటర్లకు వెళ్తున్న గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పాల గురించి అంగన్వాడీ టీచర్లను ప్రశ్నిస్తే సప్లై కావడం లేదని చెబుతున్నారు. అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీల్లో  నమోదైన చిన్నారులకు రోజుకు 100 మిల్లీలీటర్లు, గర్భిణులు, బాలింతలకు రోజుకు 200 మిల్లీలీటర్ల చొప్పున పాలు సరఫరా చేయాల్సి ఉంది. 

జిల్లాలో 1065 సెంటర్లు

జిల్లాలో మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, ధర్మపురి, జగిత్యాల, మల్యాలల్లో ఐసీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 1065 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి.  వీటి ద్వారా గర్భిణులు, బాలింతలు 12,689 మంది, ఏడు నెలల నుంచి మూడేళ్ల చిన్నారులు 35,487, మూడేళ్ల నుంచి ఐదేళ్ల వారు 14,306 మందికి  పోషకాహారం సప్లై చేస్తున్నారు. ఏప్రిల్, మే నెలలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సెంటర్లకు1,60,584 లక్షల లీటర్లు సరఫరా చేయాల్సి ఉండగా 29 వేల లీటర్ల మాత్రమే సప్లై చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.

నిత్యం ఆరోగ్యలక్ష్మి కింద గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ సెంటర్లలో  ఒక పూట సంపూర్ణ భోజనం పెట్టి ఒక్కొక్కరికి 200 మిల్లిలీటర్ల పాలు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు వారానికి రెండు సార్లు పెరుగు ఇవ్వాల్సి ఉంది. కానీ రెండున్నర నెలలుగా పాల సప్లై  నిలిచిపోవడంతో కేవలం భోజనంతోనే సరిపెడుతున్నారు. ఈ విషయమై జిల్లా మహిళా

శిశు సంక్షేమ శాఖ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాణిశ్రీ ని వివరణ కోరగా అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్లలో పాల సప్లై నిలిచిపోయిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. పాల సప్లై టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ముగిసిందని, ప్రస్తుతం కొత్త టెండర్ ప్రాసెస్ లో ఉన్నట్లు చెప్పారు. తొందరలోనే అన్ని సెంటర్లకు పాలు సప్లై అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.