ఎందుకూ..: వీకెండ్ ఆటో తోలుతున్న మైక్రోసాఫ్ట్ ఐటీ ఉద్యోగి..!

తన ఒంటరితనాన్ని అధిగమించడానికి వారాంతాల్లో ఓ మైక్రోసాఫ్ట్ టెక్కీ ఆటో నడుపుతున్న ఆశ్చర్యకరమైన సంఘటన  బెంగళూరులో చోటు చేసుకుంది.  ఒక మైక్రోసాఫ్ట్ సీనియర్ ఇంజనీర్ వారాంతాల్లో తన ఒంటరితనాన్ని అధిగమించడానికి ఆటో రిక్షా నడుపుతూ వెంకటేష్ గుప్తా అనే  ప్రయాణికుడి కెమెరాకి చిక్కాడు. ఈ విషయాన్ని ఆ ప్రయాణికుడు Xలో పోస్ట్ చేయడంతో ఇప్పుడది వైరల్ గా మారింది.

ప్రయాణికుడు వెంకటేష్ గుప్తా ఈ విధంగా పోస్ట్ చేశాడు. "వారాంతాల్లో ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి నమ్మ యాత్రిని అనే సంస్థ భాగస్వామ్యంతో ఆటో నడుపుతున్న కోరమంగళకు చెందిన 35 ఏళ్ల స్టాఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ కలిశాడు.. ఆ వ్యక్తి ఆటోరిక్షాలో మైక్రోసాఫ్ట్ హూడీ ధరించాడు.. తన వివరాలు ఆరా తీయగా ఎందుకు ఆటో నడపాల్సి వస్తుందో వివరించాడు.. పని అనంతరం వారాంతాల్లో ఒంటరితనంతో బాధపడుతున్నానని.. ఆ ఒంటరి తనాన్ని అధిగమించడం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నాని తెలిపాడు.. దీంతో అవాక్కయ్యాను" అని రాసుకొచ్చాడు. 

Aslo Read :- ఈ ఐదేళ్లు దేశ ప్రగతి కోసం కొట్లాడుదాం

ఈ పో స్ట్ పై కొంతమంది వినియోగదారులు ఆ వ్యక్తి ఒంటరితనం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తే.. మరికొందరు ఇది మూన్ లైటింగ్ అని..  ఆ వ్యక్తి పని చేస్తున్న కంపెనీలో దీనిపై ఫిర్యాదు చేస్తామని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 

కాగా టెక్కీలు బైక్ టాక్సీ డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా, గిగ్ వర్కర్లుగా పని చేస్తూ దొరికిపోవడం ఇది కొత్తేం కాదు.  బెంగుళూరు వంటి మహానగరంలో పొట్టచేతపట్టుకుని వెళ్లిన ఎందరో ఉద్యోగులు పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా  ఏదో ఒక పార్ట్ టైం పని చేయక తప్పని పరిస్థితి నెలకొంది.