Layoffs: వెయ్యి మంది ఉద్యోగుల తొలగించిన  ‘మైక్రోసాఫ్ట్’

Layoffs: టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు లక్షకు పైగా ఉద్యోగులను టెక్ కంపెనీలు తొలగించాయి. ఈ తొలగింపు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన సమస్యలు, కంపెనీలు నిర్వహణ, లేటెస్ట్ టెక్నాలజీపై మొగ్గు చూపడం ఇలా అనేక కారణాలతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి కంపెనీలు. గడిచిన మూడేళ్లలో లక్షలాది మంది టెకీలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో టెకీలలో ఆందోళన మొదలైంది. తాజాగా ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గురువారం (జూన్ 6) ప్రకటించింది.

మైక్రోసాఫ్ట్ తన కంపెనీల్లోని 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు  తెలిపింది. 2023లో 10 వేల మంది ఉద్యోగులను తగ్గించిన మైక్రోసాఫ్ట్ కంపెనీ తాజా గణనీయమైన ఉద్యోగాలను తగ్గించింది. 

యూఎస్ లోని  మైక్రోసాఫ్ట్ కంపెనీ  అన్ని విభాగాలనుంచి 1000 మంది ఉద్యోగులను తగ్గించేందుకు నిర్ణయించింది. ఇటీవల కంపెనీ ఉద్యోగులను తొలగిస్తూ మైక్రోసాఫ్ట్ ప్రకటించి నెలల వ్యవధిలోని వర్క్ ఫోర్స్  మళ్లీ ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేసింది. 

అజూర్ క్లౌడ్ లో ఉద్యోగాల కోత 

టెలికాం సంస్థలు, అంతరిక్ష కంపెనీలకోసం మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాఫ్ట్ వేర్, సర్వర్ రెంటల్లను విక్రయించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుంది. కంపెనీ వ్యూహాత్మక మిషన్స్, లేటెస్ట్ టెక్నాలజీ వైపు మొగ్గు.. కంపెనీ ఉద్యోగాల కోతల తప్పని పరిస్థితి కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ మిక్స్ డ్ రియాలిటీ యూనిట్ లో ఉద్యోగాలను కూడా తగ్గిస్తుంది.