ఇన్స్టాగ్రామ్లో పొలిటికల్ కంటెంట్ ఎర్రర్.. బెంబేలెత్తిపోతున్న యూజర్లు

ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో పొలిటికల్ కంటెంట్ కనిపించడం పోవడం అనే సమస్య తలెత్తింది. చాలా మంది యూజర్లు ఇన్ స్టాగ్రామ్ పొలిటికల్ కంటెంట్ సెట్టింగ్ ల టూల్ లోని వ్యక్తుల ఎంపిక వాస్తవానికి ఎటువంటి మార్పు చేయనప్పటికీ రీసెట్ చేయబడుతుంది. ఇలా జరగడంతో నెటిజన్లు వారికి ఎదురైన సమస్యలను ఇంటర్నె ట్ లో సమాచారాన్ని పోస్ట్  చేస్తున్నారు.  అయితే విషయంపై ఇన్ స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటా వివరణ ఇచ్చింది. 

2024 మార్చిలో ఇన్ స్టాగ్రామ్ , థ్రెడ్ లకు రాజకీయ కంటెంట్ ను పరిమితం చేసుకునేందుకు సెట్టింగ్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఎవరైతే పొలిటికల్ కంటెంట్ ను చూడకూడదని అనుకుంటారో వారు సెట్టింగ్ ను మార్చడం ద్వారా అలాంటి పోస్ట్ లను చూడకుండా చేస్తుంది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. 

ఎంచుకున్న కస్టమర్లతో పాటు మిగతా కస్టమర్ల పొలిటికల్ కంటెంట్ సెట్టింగ్ లో కూడా మార్పులు వస్తున్నాయి. దీంతో ఇన్ స్టాగ్రామ్ యూజర్లు సమస్యను పోస్టుల ద్వారా హైలైట్ చేశారు. దీనిపై స్పందించిన మెటా కంపెనీ.. ‘‘ మొత్తం యూజర్లను పొలికల్ కంటెంట్ సెట్టింగ్ లను మార్చలేదు.. ఇది కేవలం ఎర్రర్ మాత్రమే అని తెలిపింది. దీనిని సరిచేసే పనిలో ఉన్నాం అని మెటా స్పోక్స్ పర్సన్ ఆండీ స్టోన్ చెప్పారు.