ఫేస్​బుక్ మెసెంజర్ నుంచి వీడియో కాల్స్ చేసేవాళ్లందరికీ ఈ విషయం తెలియాలి..

ఫేస్​బుక్ మెసెంజర్​ హెచ్​డీ క్వాలిటీ వీడియో కాల్స్, బ్యాక్​గ్రౌండ్ నాయిస్ సప్రెషన్, వాయిస్​ ఐసోలేషన్​ వంటి ఫీచర్లను లాంచ్ చేసింది. ఇది మెసెంజర్​ నుంచి నేరుగా క్లియర్​, హై క్వాలిటీ కాల్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. వైఫైలో చేసే వీడియో కాల్స్ కోసం హెచ్​డీ డిఫాల్ట్​గా స్టార్ట్ అవుతుంది. సెల్యులార్ డేటాపై వీడియోకాల్స్​ కోసం హెచ్​డీని ఎనేబుల్ చేయాలంటే.. కాల్ సెట్టింగ్స్​కు వెళ్లి, ‘మొబైల్ డేటా ఫర్ హెచ్​డీ వీడియో’ను ఆన్​ చేయాలి. 

మెసెంజర్​లోని కాల్ సెట్టింగ్స్​ ద్వారా బ్యాక్​గ్రౌండ్​ నాయిస్ సప్రెషన్, వాయిస్ ఐసోలేషన్​ని ఎనేబుల్ చేయొచ్చు. ఒకవేళ ఫేస్​బుక్​ మెసెంజర్​లో ఫ్రెండ్స్ కాల్​ అటెండ్ చేయనప్పుడు ఆడియో లేదా వీడియో వాయిస్ మెసేజ్​లను పంపొచ్చు. ఆన్సర్ చేయని ఆడియో కాల్స్ కోసం, వాయిస్​ మెసేజ్​ని లేదా ఆన్సర్​ లేని వీడియో కాల్స్ కోసం వీడియో మెసేజ్​ సెండ్ చేయడానికి ‘రికార్డ్​ మెసేజ్’ ఆప్షన్​పై క్లిక్ చేయాలి. 

ఐఫోన్ యూజర్లు ఇప్పుడు ‘సిరి’ని మెసెంజర్​ యాప్​ ద్వారా కాల్ లేదా మెసేజ్​ సెండ్​ చేయమని అడగొచ్చు. ‘‘హే సిరి, మెసెంజర్​లో మెసేజ్​ సెండ్’ ఇప్పుడు హ్యాండ్స్​ – ఫ్రీ కాల్స్​ కోసం పనిచేస్తుంది. యాపిల్​ కొంతకాలంగా అందిస్తున్న ఫీచర్ ఇది. అయితే మెసెంజర్​ ఇప్పటివరకు దీనికి సపోర్ట్ చేయలేదు.