టెక్నాలజీ : ఆ మూడు యాప్స్​లో ఏఐ?

వాట్సాప్, ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ మెటా ఏఐ చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాట్ వచ్చేసింది. ఈ చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంగాలీ, హిందీతో పాటు అనేక మల్టీపుల్ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూడు యాప్స్​లో దీన్నెలా వాడాలంటే...

వాట్సాప్​లో ఏఐ 

 వాట్సాప్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లేటెస్ట్ వెర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్డేట్ చేయాలి. యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్ చేసి, న్యూ చాట్ ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైన రంగుల రింగ్ ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి, కంటిన్యూ ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ట్యాప్ చేయాలి.  

ఆ తర్వాత  వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చాట్ చేసినట్టే ఏఐ చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాట్లాడొచ్చు. ఇక్కడ  ప్రాంప్ట్స్​తో రకరకాల ప్రశ్నలు అడగొచ్చు.

ఇన్​స్టాలో ఇలా..

ఇన్​స్టాగ్రామ్​లో కుడివైపు పైన ఉన్న మెసెంజర్ సింబల్ పక్కన ఉన్న సెండ్​ ఆప్షన్​ కనిపిస్తుంది. కుడివైపు పైన ఉన్న పెన్సిల్ గుర్తుపై క్లిక్ చేయాలి. తర్వాత క్రియేట్ ఏఐ చాట్ ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ట్యాప్​ చేయాలి. ఆపై మెటా ఏఐని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రాంప్ట్ టైప్ చేసి సెండ్ ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై క్లిక్ చేయాలి.

ఫేస్​బుక్​లో...

 ముందుగా చాట్ ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పెన్సిల్ ఐకాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఏఐ చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఎంచుకుని, మెటా ఏఐపై క్లిక్​ చేయాలి. అప్పుడు  ఇచ్చే ప్రాంప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ప్రకారం మెటా ఏఐ చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాట్ రియాక్ట్ అవుతుంది.