మెట్ పల్లి మండలంలో దొంగల ముఠా అరెస్ట్

మెట్ పల్లి, వెలుగు: హైవే పక్కన ఆగి ఉన్న లారీలను టార్గెట్ చేస్తూ డ్రైవర్లను కొట్టి నగదు, సెల్ ఫోన్లను ఎత్తుకెళ్తున్న ముగ్గురు దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్ రావు తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ఏనుగు వంశీ(25) మఠంవాడకు చెందిన బైండ్ల వేణు (23), బండలింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కైరా వెంకటేష్ అలియాస్ రవి గౌడ్ (30) కూలీ పని చేసేవారు.

జల్సాలకు అలవాటు పడిన వీరు.. ముఠాగా ఏర్పడి దోపిడీలు చేస్తున్నారు. ఈ నెల 21న ఆర్మూర్ నుంచి కరీంనగర్ మక్కల లోడుతో వెళ్తున్న లారీని టాయిలెట్ కోసమని డ్రైవర్ గంగాధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు పక్కన ఆపగా.. బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వచ్చిన ముఠా అతనిపై దాడి చేసి, రూ.5 వేలు నగదు, సెల్ ఫోన్ లాక్కొని పారిపోయారు. డ్రైవర్ అదే రోజు రాత్రి ఇబ్రహీంపట్నం పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేశాడు.

సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ ఎస్సైలు మూడు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. సోమవారం ఇబ్రహీంపట్నం ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అనుమానాస్పదంగా కనిపించిన వారిని పట్టుకొని విచారించారు. విచారణలో నేరం ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.5వేల నగదుతోపాటు సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 200 గ్రాముల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకొని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
చేసినట్లు డీఎస్పీ తెలిపారు.