విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంపు..సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

మంచిర్యాల: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గురుకుల హాస్టళ్లలో నెలవారీ మెస్ అలవెన్స్‌లను పెంచినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ మంచిర్యాల జిల్లాలో విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తాండూరు మండలంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలర హాస్టల్ లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి విద్యార్థులు పాలాభిషేకం చేశారు 

గురుకులాల్లో మెస్ ఛార్జీల పెంపు ప్రకటన వెలువడినప్పుటినుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పాలాభిషేకాలు, ధన్యవాద ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురుకుల హాస్టళ్లలో నెలవారీ మెస్ అలవెన్స్‌లను పెంచినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ హైదరాబాద్‌లోని కళాశాల హాస్టల్ విద్యార్థులు ఆదివారం ర్యాలీలు, సభలు నిర్వహించారు. 

Also Read : ఎల్లంపల్లి భూ నిర్వాసితులను బీఆర్ఎస్ ఎప్పుడు పట్టించుకోలేదు

మెస్ చార్జీలు పెంచడం వల్ల ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలకు చెందిన 8.50 లక్షల మంది విద్యార్థిని, విద్యార్థులకు, లబ్ధి చేకూర నుంది. 

మెస్ కాస్మొటిక్ చార్జీల పెంపుతో చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న విద్యార్థులకు ప్రయోజనం చేకూర నుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం 3 నుంచి 7 వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు మెస్ ఛార్జీలు రూ 950 నుంచి రూ 1330కు పెరిగాయి.

8 నుంచి 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు రూ 1100 నుంచి రూ 1540 లకు పెరిగింది. ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్థినీ విద్యార్థులకు రూ 1500 నుంచి రూ. 2100కు పెరిగాయి.