లంచం తీసుకున్న యాదగిరిగుట్ట ఆలయ అధికారులకు మెమోలు జారీ

యాదాద్రిభువనగిరి:యాదగిరి గుట్ట ఆలయంలో అధికారులు చేతివాటం ప్రదర్శించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగికి రావాల్సిన బకాయిలు విషయంలో లంచం తీసుకున్న ఇద్దరు ఆలయ అధికారులకు మెమోలు జారీ చేశారు. 

ఆలయానికి  చెందిన ఓ ఉద్యోగి పదవీవిరమణ పొందగా.. తనకు రావాల్సిన బకాయిల కోసం సూపరింటెండెంట్ దాసోసు నరేష్, సీనియర్ అసిస్టెంట్ సీతారామ్మూర్తి లు రూ. 30వేలు లంచం తీసుకున్నారని ఆలయ ఈవో భాస్కర్ రావు వారిద్దరికి మెమోలు జారీ చేశారు. 

Also Read:-కౌశిక్ రెడ్డి ఓ బ్రోకర్.. నువ్వు రాకపోతే నేనే నీ ఇంటికొస్తా