గవర్నర్​ను కలిసిన రెడ్​క్రాస్ ​సొసైటీ సభ్యులు

పిట్లం,వెలుగు: తెలంగాణ కొత్త గవర్నర్​పీసీ రాధాకృష్ణన్​ను పిట్లం ఇండియన్​ రెడ్​క్రాస్​సొసైటీ సభ్యులు, స్టేట్​ కమిటీ మెంబర్​సంజీవ్​రెడ్డి కలిశారు. గురువారం రాజ్​భవన్​లో స్టేట్​కమిటీ ప్రెసిడెంట్​అజయ్​మిశ్రాతో కలసి గవర్నర్​కు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో  రెడ్​క్రాస్ ​నిర్వహిస్తున్న సేవలను గవర్నర్​కు వివరించినట్లు సంజీవ్​రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రక్తం నిల్వలు తగ్గిపోతున్నాయని, నిల్వలు పెంచడానికి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని గవర్నర్​సూచించినట్లు చెప్పారు. ఆయన​ సూచనల మేరకు రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని సంజీవ్​రెడ్డి తెలిపారు.