సిరిసిల్లలో మెగా జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళా

రాజన్నసిరిసిల్ల, వెలుగు:  యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.  సిరిసిల్లలోని కల్యాణి లక్ష్మి ఫంక్షన్ హాల్ లో గురువారం పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ నివారణ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహకారంతో  గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. మేళాకు సుమారు 8వేల మంది అభ్యర్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. 

విప్ మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించేందుకు ఎస్పీ అఖిల్ మహాజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ కృషి చేయడం అభినందనీయమన్నారు. డ్రగ్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. మేళాలో 60కి పైగా కంపెనీలు 1000 మందికి నియామక పత్రాలను అందించారు. కార్యక్రమంలో డీఎస్పీలు చంద్రశేఖర్ రెడ్డి, నాగేంద్రచారి, మురళీకృష్ణ, సీఐలు రఘుపతి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.