జూన్13న మెగా జాబ్ మేళా

  •     ఎస్పీ అఖిల్ మహాజన్ 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం ఉద్యోగ మేళా పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 13న టౌన్ లో కల్యాణలక్ష్మి ఫంక్షన్​హాల్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజన్నసిరిసిల్ల జిల్లాను డ్రగ్ ఫ్రీగా తీర్చిదిద్దే క్రమంలో యువతకు ఉపాధి కల్పనకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 60 కి పైగా కంపెనీలు,1000కి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. టెన్త్​, ఇంటర్, డిగ్రీ చదివిన యువత అర్హులని తెలిపారు. https://me-qr.com/z0s8PfJt వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.