ఎమ్మెల్సీ ఎన్నికపై గాంధీ భవన్​లో మీటింగ్

హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగనున్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై సోమవారం గాంధీ భవన్​లో పీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఆ నియోజక వర్గ పరిధిలోని 4 ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం జరగనుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నేతలు పాల్గొననున్నారు.