Victory Venkatesh: వెంకీ మామ బర్త్డేకి అలిగిన మీనాక్షి.. నవ్విస్తున్న విక్టరీ, ఐశ్వర్య

విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(SankranthikiVasthunam). మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌‌. సంక్రాంతి కానుకగా జనవరి14న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. 

ఇవాళ శుక్రవారం డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టిన రోజు సందర్బంగా సంక్రాంతికి వస్తున్నాం నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. "తరతరాలుగా సినీ అభిమానులు నిరంతరం అభిమానించే వ్యక్తికి సంక్రాంతికి వస్తున్నాం టీమ్ సగర్వంగా విజయాన్ని కోరుకుంటోంది.. పుట్టినరోజు శుభాకాంక్షలు వెంకీమామ" అంటూ విషెస్ తెలిపారు. 

Also Read : మారిపోయిన మోహన్ బాబు.. హాస్పిటల్ నుంచి ఇంటికెళ్లాక చేసిన మొదటి పని ఇదే..
 
పాట విషయానికి వస్తే.. మీను( Meenu Song ) అంటూ సాగిన ప్రోమో స్పెషల్ డ్యూయెట్లా ఉంది. "నా లైఫ్ లో ఉన్న ఆ ప్రేమ పేజీని తీయన..పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా.. " అంటున్న ఈ పాట అలిగిన మీనాక్షిని నవ్వించే ప్రయత్నంలో భాగంగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పూర్తి లిరికల్ వీడియో త్వరలో రిలీజ్ కానుంది.

ఈ పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయడంతో పాటు ప్రణవి ఆచార్యతో కలిసి పాడాడు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఇటీవలే ‘గోదారి గట్టుమీద రామ చిలకవే.. ఓ గోరింటాకెట్టుకున్న సందమామవే’ అంటూ సాగిన ఫస్ట్ సింగిల్ మెలోడీ గీతం శ్రోతలను వీపరీతంగా ఆకట్టుకుంటోంది.