హైదరాబాద్, వెలుగు: మెడికవర్ హాస్పిటల్ బెంగళూర్‌లో తన బ్రాంచ్ ప్రారంభించింది. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు సతీశ్ జర్కిహోలి, దినేశ్ గుండురావుతో కలిసి మెడికవర్ కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు. సుమారు రూ.120 కోట్ల పెట్టుబడితో 300 బెడ్ల కెపాసిటీతో ఈ హాస్పిటల్‌ను ఏర్పాటు చేశారు. మెడికవర్ హాస్పిటల్స్‌లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్అభినందించారు.
దేశవ్యాప్తంగా 24 బ్రాంచ్‌లను కలిగి ఉన్న మెడికవర్ హాస్పిటల్స్సుమారు 14 వేల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నదని, మెడికవర్యాజమాన్యానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని చెప్పారు. ఈ హాస్పిటల్రాకతో బెంగళూర్‌లో వైద్య సేవలు మరింత మెరుగుపడుతాయని ఆశిస్తున్నామన్నారు. రీజనబుల్ చార్జీలతో మెడికవర్ హాస్పిటల్ వైద్యం అందించడం అభినందనీయమని ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ అన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్ అండ్మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.అనిల్ కృష్ణ మాట్లాడుతూ.. బెంగళూర్‌లో రాబోయే మూడేండ్లలో నాలుగు బ్రాంచ్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.