మెడికల్ షాపు సీజ్ .. ఒక్క ఇంజక్షన్ మీద రూ.947 ఎక్కువ వసూలు

మెడికల్ షాపుల్లో దందాలు మాములుగా లేవు.  ఆరోగ్యానికి సంబంధించిన విషయం కావడంతో టాబ్లెట్స్, ఇంజక్షన్లకు ఎంతంటే అంత ఇచ్చేయాల్సిందే. బేరాలు ఉండవు.  ఇదే ఆనువుగా తీసుకొని కొందరు మెడికల్ షాపుల యజమానులు రెచ్చిపోతున్నారు.  

తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో యాంటీ బయోటిక్ ఇంజక్షన్లను ఎక్కువ రేట్లకు అమ్ముతున్న శ్రీ రామ మెడికల్ షాప్ ను  డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. 952 రూపాయలకు  ఉండాల్సిన ఇంజక్షన్ ను  రూ. 1,899 రూపాయలకు అమ్ముతున్నారు.  

 స్థానికుల సమాచారం మేరకు ఎమ్మార్పీ ఎక్కువ ప్రింట్ చేసి అమ్ముతున్న మెడికల్ షాప్ లో ఇవాళ అధికారులు సోదాలు నిర్వహించారు.  రూ. 36 వేల విలువైన యాంటీ బయోటిక్ ఇంజక్షన్స్ ని సీజ్ చేశారు.