Horrific: టెర్రిఫిక్..సెన్స్లెస్ అటాక్.. జర్మనీ క్రిస్మస్ మార్కెట్ దాడిని ఖండించిన భారత్

జర్మనీలో క్రిస్మస్ మార్కెట్ లో దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది సెన్స్ లెస్, హారిఫీక్ అటాక్ అని మండిపడింది.ఎంతో మంది విలువైన ప్రాణాలు కోల్పోగా..అనేక మంది  తీవ్రంగా గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. 

శుక్రవారం (20)న జర్మనిలోని మాగ్డేబర్గ్ లో రద్దీగా ఉంటే క్రిస్మస్ మార్కెట్ లో సౌదీకి చెందిన డాక్టర్ తన కారుతో జనంతో దూసుకుపోవడం ద్వారా దాడి చేశారు. ఈ దాడిలో చిన్నారి తో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.. దాదాపు 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ తయోబ్ ను 50ఏళ్ల సౌదీ డాక్టర్ గా గుర్తించి అరెస్ట్ చేశారు. 

ALSO READ | యూట్యూబర్​: ప్రేమ..పెళ్లి..ప్రయాణం..

 జర్మనీ క్రిస్మస్ మార్కెట్ లో దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది..ఈ దాడి హారిఫిక్.. సెన్స్ లెస్.. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం..  అని భారత  విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. బాధితులతో మేమున్నాం..ఇండియన్ ఎంబసీ అక్కడి భారతీయ కుటుంబాలతో చర్చలు జరుపుతోంది.. బాధితు కుటుంబాలను సాధ్యమైనంత వరకు సహాయాన్ని అందిస్తామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.