కరీంనగర్ లో రూ.16 కోట్లతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు : మేయర్ యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సిటీలోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో రూ.16కోట్లతో స్పెషల్  పర్పస్ వెహికల్(ఎస్ పీవీ) ఇంటిగ్రేటెడ్​ కమాండ్  కంట్రోల్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. 

శుక్రవారం కమాండ్ కంట్రోల్ నిర్మాణ  పనులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ జనవరిలో కమాండ్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం లో లెవల్ జోన్ పరిధిలోని భగత్ నగర్ రిజర్వాయర్ సమీపంలో పైపులైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లీకేజీ ఏర్పడగా.. చేపట్టిన రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులను పరిశీలించారు.