30 ఏండ్ల దాకా తాగునీటికి సమస్యల్లేకుండా చర్యలు : మేయర్ యాదగిరి సునీల్‌‌‌‌‌‌‌‌రావు

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ సిటీతో పాటు విలీనగ్రామాల ప్రజలకు రానున్న 30 ఏండ్ల వరకు తాగునీటి సమస్యలు లేకుండా పైప్ లైన్ పనులు చేపడుతున్నట్లు మేయర్ యాదగిరి సునీల్‌‌‌‌‌‌‌‌రావు తెలిపారు. బుధవారం స్థానిక 21వ డివిజన్ లో రూ.35లక్షలతో చేపడుతున్న తాగునీటి పైప్ లైన్ పనులను మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతాప్రమాణాలతో వేగంగా పనులు  పూర్తి చేయాలని ఆదేశించారు.  

అమృత్ 2లో భాగంగా తాగునీటి సప్లై కోసం పైప్ లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఆర్అండ్‌‌‌‌‌‌‌‌బీ ఆధ్వర్యంతో సిటీలో చేపట్టిన కల్వర్టుల్లో కొన్నిచోట్ల కెపాసిటీ సరిపోకపోవడంతో వర్షాకాలంలో వరదనీరు రోడ్లపైకి వస్తున్నట్లు, ఆయా కల్వర్టులను విస్తరించి నిర్మించాలన్నారు. ఆయన వెంట కార్పొరేటర్ సాగర్, అధికారులు పాల్గొన్నారు.