స్వచ్ఛదనం పచ్చదనం ప్రొగ్రామ్​ సక్సెస్

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో  ‘స్వచ్ఛదనం, పచ్చదనం’ విజయవంతమైందని మేయర్ సునీల్ రావు తెలిపారు. శుక్రవారం బల్దియా ఆధ్వర్యంలో  నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో

కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి మేయర్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్కల్ని  కన్నబిడ్డల్లా సంరక్షించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం డీర్ పార్కులో మొక్కలు నాటి రాశివనాన్నిసందర్శించారు.