కామారెడ్డిలో భారీ చోరీ జరిగింది. జిల్లా కేంద్రంలోని రాజానగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడి.. ఇళ్లు గుళ్ల చేశారు. కాలనీకు చెందిన శ్రీకాంత్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సరికి.. కొందరు గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.
ఇంట్లో ఉన్న 9తులాల బంగారం, 2వేల రూపాయల నగదు, 15తులాల వెండిని దోచుకెళ్లారు దుండగులు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు కామారెడ్డి పట్టణ పోలీసులు.