ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. ముంబై లోయర్ పరేల్‌లోని కమలా మిల్ కాంపౌండ్‌లో ఉన్న ఏడు అంతస్థుల టైమ్స్ టవర్ కమర్షియల్ కాంప్లెక్స్ లో శుక్రవారం ( సెప్టెంబర్ 6, 2024 ) ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపారు.
తొమ్మిది ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.14 అంతస్తుల వాణిజ్య భవనం వెనుక భాగంలో 3వ అంతస్తు నుంచి 7వ అంతస్తు వరకు ఉన్న ఎలక్ట్రిక్ డక్ట్కి మంటలు అంటుకోవడంతో ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
Also Read:-సెలెంట్‌గా ఉంటే బెటర్
మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు.