పాకిస్తాన్: శనివారం(నవంబర్ 09) తెల్లవారుజామున క్వెట్టా రైల్వే స్టేషన్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.
పెషావర్ వెళ్లాల్సిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం ప్రయాణీకులు ప్లాట్‌ఫారమ్‌పై వేచి చూస్తుండగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి శరీర భాగాలు ముక్కలయ్యాయి. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
?? At least 20 people were killed and 30 injured in an explosion at a railway station in the city of Quetta in the Pakistani province of Baluchistan.
— S p r i n t e r (@SprinterFamily) November 9, 2024
The police are investigating the cause of the explosion, it is ruled out as a terrorist act. pic.twitter.com/7cVEYXHrBp
రైల్వే అధికారుల ప్రకారం, శనివారం ఉదయం 9:00 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు జరిగిన సమయంలో రైలు ప్లాట్‌ఫారమ్‌పై లేదు. బుకింగ్ కార్యాలయం లక్ష్యంగా ఈ పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని క్వెట్టా సివిల్ ఆసుపత్రికి తరలించారు.