ఫుట్​బాల్ ఫ్యాన్స్​కు బంపర్ ఆఫర్

దుబాయి​లోని ఒక హోటల్ ఇంగ్లిష్​ ఫుట్​బాల్ క్లబ్ మాంచెస్టర్​కి ఒక ఆఫర్ డెడికేట్ చేసింది. అదేంటంటే.. ఫుట్​ బాల్ ఫ్యాన్స్ క్లబ్​కు 90ల నాటి జ్ఞాపకాలను అందించాలనుకుంది. అందుకోసం మారియట్ రిసార్ట్ పామ్​ జుమేరాలో రూమ్​లు రెడీ చేసింది. ఇందులో ఫ్యాన్స్ చరిత్రను, దాని గొప్పతనాన్ని గౌరవిస్తూ 25వ యానివర్సరీ వేడుక చేయాలనుకుంది. అందుకోసం ఏర్పాటు చేసిన రూమ్​ను వీడియో తీసి ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో మినీ బార్, ఫుట్​బాల్ టేబుల్, మాంచెస్టర్​ లోగో ఉన్న బాత్​ రోబ్స్, బీచ్ బ్యాగ్ వంటివి కనిపించాయి. సీడీలు, రెట్రో గేమ్స్ వంటి వాటికోసం స్పెషల్​గా కొంత ప్లేస్ కూడా ఉంది. విహెచ్​డీ టేప్​లు క్లాసిక్‌ టీమ్ స్టోరీలతో నిండిపోయాయి. అతిథులకు ఫుట్​బాల్ ఎక్స్​పీరియెన్స్ ఇవ్వాలనే ఆ హోటల్ ఇలా డిజైన్ చేసిందట.

హోటల్ వెబ్​సైట్​లో రాసిన ప్రకారం, ఈ ఆఫర్ మే 13 నుంచి జులై 8 వరకు మాత్రమే ఉంటుంది. ఒక్కో రూమ్​లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉండొచ్చు. లివింగ్, డైనింగ్​లకు సెపరేట్​ ప్లేస్​లు ఉన్నాయి. అతిథులు తప్పకుండా సూట్ వేసుకుని ఉండాలి. అలాగే వాళ్లకు మాంచెస్టర్ యునైటెడ్ గూడీస్ నుంచి ప్రత్యేకమైన గిఫ్ట్​ ప్యాక్ ఇస్తారు.