102 ఏండ్ల అవ్వతో వందేండ్ల తాత పెండ్లి

వాషింగ్టన్: అమెరికాలో ఇటీవల102 ఏండ్ల వృద్ధురాలితో వందేండ్ల వృద్ధుడికి జరిగిన లవ్ మ్యారేజీ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌‌‌‌లో చోటు సంపాదించింది. దీనిపై వరుడు బెర్నీ లిట్‌‌‌‌మన్, వధువు మార్జోరీ ఫిటర్‌‌‌‌మాన్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుల ఇద్దరి వయస్సు కలిపితే 202 ఏండ్ల 271 రోజులని లండన్‎లోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌‌‌‌ సంస్థ వెల్లడించింది. అందుకే వారికి ఓల్డెస్ట్ కొత్త జంటగా గిన్నిస్ రికార్డులో చోటు దక్కినట్లు ఈ నెల 3న కన్ఫమ్ చేసింది. బెర్నీ లిట్‌‌‌‌మన్, మార్జోరీ ఫిటర్‌‌‌‌మాన్ పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా సిటీలో సీనియర్ లివింగ్ హోమ్‌‌‌‌లో కలుసుకున్నారు. పదేండ్లుగా లవ్ చేసుకున్నారు. ఈ ఏడాది మే 3న పెండ్లి చేసుకున్నారు. ఈ జంట ఉమ్మడి వయస్సు(202 ఏండ్లు) ఇప్పటిదాకా రికార్డులో ఉన్న మరొక శతాధిక జంట రికార్డును అధిగమించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఓల్డెస్ట్ కొత్త జంట గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది.