నాటో సెక్రటరీ జనరల్​గా మార్క్​ రుట్టే

ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి నార్త్​ అట్లాంటిక్​ ట్రీటి ఆర్గనైజేషన్​(నాటో)కు తదుపరి సెక్రటరీ జనరల్​ డచ్ ప్రధాన మంత్రి మార్క్​ రుట్టే నియమితులయ్యారు. 2024, అక్టోబర్​ 1 నుంచి రుట్టే సెక్రటరీ జనరల్​గా తన విధులను స్వీకరించనున్నారు.

ఉక్రెయిన్​లో యుద్ధం కొనసాగుతున్న వేళ ఐరోపా భద్రతకు కీలకమైన సమయంలో మార్క్​ రుట్టే బాధ్యతలు చేపట్టనున్నారు.