కొనుగోలు కేంద్రం ఒకటే.. ప్రారంభోత్సవాలు రెండు!

  • బోథ్ లో సోయా కొనుగోలు కేంద్రాన్ని పోటా పోటీగా ప్రారంభించిన కాంగ్రెస్,
  • బీఆర్ఎస్ నాయకులు

బోథ్, వెలుగు: మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో బోథ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. ముందు కాంగ్రెస్​నేతలు, కొద్దిసేపటికి బీఆర్​ఎస్​నాయకులు వచ్చి ప్రారంభించారు. దీంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జ్ ఆడే గజేందర్, పీఏసీఎస్ డైరెక్టర్లు, పార్టీ నాయకులు, రైతులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

 అయితే మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్, అడిషనల్ కలెక్టర్, మార్క్ ఫెడ్ అధికారులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి వచ్చి మరోసారి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే ఎమ్మెల్యే రెండోసారి ప్రారంభించడం పట్ల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవానికి వచ్చిన అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని, సదరు అధికారులపై కలెక్టర్​కు ఫిర్యాదు చేసినట్లు మార్కెట్ చైర్మన్ గంగారెడ్డి పేర్కొన్నారు.