మావోయిస్ట్‌‌‌‌ నేత ప్రభాకర్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌

  • స్వస్థలం జగిత్యాల జిల్లా బీర్పూర్‌‌‌‌
  • చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని కాంకేర్‌‌‌‌ జిల్లాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్‌‌‌‌ అగ్రనేత ప్రభాకర్‌‌‌‌ అలియాస్‌‌‌‌ బలమూరి నారాయణరావును చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని కాంకేర్‌‌‌‌ జిల్లా పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. సోమవారం కాంకేర్‌‌‌‌ జిల్లాలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ప్రభాకర్‌‌‌‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో మావోయిస్ట్‌‌‌‌ నేతగా బయటపడింది. ప్రభాకర్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌ విషయాన్ని బస్తర్‌‌‌‌ ఐజీ సుందర్‌‌‌‌ రాజ్‌‌‌‌ కూడా ధృవీకరించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్‌‌‌‌ గ్రామానికి చెందిన ప్రభాకర్‌‌‌‌ 40 ఏండ్లుగా మావోయిస్ట్‌‌‌‌ ఉద్యమంలో పనిచేస్తున్నారు.

ఇతడిపై రూ.25 లక్షల రివార్డు ఉంది. ప్రభాకర్‌‌‌‌ మావోయిస్ట్‌‌‌‌ కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి గణపతికి సమీప బంధువు. ప్రభాకర్‌‌‌‌ ప్రస్తుతం మావోయిస్ట్‌‌‌‌ నార్త్‌‌‌‌ సబ్‌‌‌‌జోనల్‌‌‌‌ బ్యూరో మొబైల్‌‌‌‌ పొలిటికల్‌‌‌‌ స్కూల్‌‌‌‌కు, లాజిస్టిక్స్‌‌‌‌ సప్లై ఇన్‌‌‌‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. 1984లో పీపుల్స్‌‌‌‌వార్‌‌‌‌లో చేరిన ప్రభాకర్‌‌‌‌ ప్రస్తుత మావోయిస్ట్‌‌‌‌ కేంద్ర కమిటీ కార్యదర్శి బస్వరాజ్, రామచంద్రారెడ్డి అలియాస్‌‌‌‌ రాజు, దేవాజీ అలియాస్‌‌‌‌ కుమా దాదా, కోస, సోను, మల్లా రాజిరెడ్డి అలియాస్‌‌‌‌ సంగ్రామ్‌‌‌‌తో సత్సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రభాకర్‌‌‌‌ అలియాస్‌‌‌‌ బలమూరి నారాయణరావు 1984–-94 మధ్య ఉమ్మడి ఏపీలో పీపుల్స్‌‌‌‌వార్‌‌‌‌ సంస్థలో పనిచేశారు. 1995– 97 వరకు మధ్యప్రదేశ్‌‌‌‌లోని బాలాఘాట్‌‌‌‌కు పార్టీ తరఫున నేతృత్వం వహించారు. 1998–-2005 మధ్య ఉత్తర బస్తర్‌‌‌‌ కోయిలీబేడా ఏరియాలో, 2005– 2007 మద్య దండకారణ్యం స్పెషల్‌‌‌‌ జోనకల్‌‌‌‌ కమిటీ, అర్బన్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లో పనిచేశారు. 2007–2008 మధ్య మాన్‌‌‌‌పూర్‌‌‌‌- మోహ్లా ఏరియా కమిటీ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 2008 నుంచి ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ మొబైల్‌‌‌‌ పొలిటికల్‌‌‌‌ స్కూల్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.