బైరాపూర్ గ్రామాంలో బీజేపీలో పలువురి చేరిక

బీర్కూర్​, వెలుగు:  బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు బుధవారం బీజేపీ లో చేరారు.  పార్టీలో చేరిన వారికి ఎంపీ బీబీ పాటిల్​ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్​ మాట్లాడుతూ.. జహీరాబాద్​లో బీజేపీ జెండా ఎగురవేసేందుకు బీజేపీ లీడర్లు సైనికుల్లా పని చేయాలన్నారు. 

కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షురాలు అరుణ తార,  మండల అధ్యక్షుడు నాగేళ్ల సాయి కిరణ్ లీడర్లు మక్కన్న, బొంతలా శ్రీనివాస్, మల్లెలా యోగేష్, తదితరులు పాల్గొన్నారు.