పెద్ద చెరువు నీళ్లు  సాగుకే వాడాలి : రైతులు

  • కలెక్టరేట్​కు తరలివచ్చిన పలు గ్రామాల రైతులు

కామారెడ్డి, వెలుగు: సదాశివనగర్​మండలంలోని అడ్లూర్​ఎల్లారెడ్డి పెద్ద చెరువు నీళ్లను పంటల సాగుకే వినియోగించాలని డిమాండ్​చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్​కు పలు గ్రామాల రైతులు మంగళవారం తరలివచ్చారు. కామారెడ్డి టౌన్​తాగునీటి అవసరాలకు  పెద్ద చెరువు నుంచి 30 శాతం నీటిని వినియోగిస్తామనే ప్రపోజల్స్​ను విరమించుకోవాలని కోరారు.

అడ్లూర్​ఎల్లారెడ్డి, టెకిర్యాల్, అడ్లూర్​,  రంగంపేట, ఇస్రోజివాడి,  పోశానిపేట పరిధిలోని ఆయకట్టుకు పెద్దచెరువు 2 పంటలకు సాగునీరందిస్తోందని చెప్పారు. చెరువు నీటిని తాగునీటి అవసరాలకు కేటాయిస్తే సాగుకు ఇబ్బందులు ఏర్పడుతాయని వాపోయారు. ఈ మేరకు అడిషనల్​కలెక్టర్​శ్రీనివాస్​రెడ్డితోపాటు మున్సిపల్ కమిషనర్​సుజాతకు, ఇరిగేషన్​ ఆఫీసర్లకు వినతి పత్రాలు అందజేశారు. 

రైతులను ఆగం చేయొద్దు 

శ్రీనివాస్​రెడ్డి, రైతు, అడ్లూర్​ఎల్లారెడ్డిఅడ్లూర్​ఎల్లారెడ్డి చెరువు ద్వారా చాలా గ్రామాలకు సాగు నీరందుతోంది. 2 పంటలకు నీళ్లు ఇవ్వడమే కాకుండా ఈ చెరువు ద్వారా భూగర్భజలాలు ఉంటున్నాయి. టౌన్​కు తాగునీళ్లను సప్లయ్​ చేసేందుకు చెరువును తీసుకుంటామనే ఆలోచన విరమించుకోవాలి.  మా భూములకు  చెరువు నీళ్లే ఆధారం.  రైతులను ఆగం చేయవద్దు