సోలార్​ ఫౌంటైన్​ .. వీటిని ఎలా వాడచ్చంటే

ఇంటి ముందు ఫౌంటైన్​ పెట్టుకోవాలి అని చాలామంది అనుకుంటారు. కానీ.. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. పైగా అందరి ఇళ్ల ముందు పెద్ద ఫౌంటైన్ పెట్టుకునేంత స్థలం ఉండకపోవచ్చు. అందుకే  ఈ పోర్టబుల్​ సోలార్​ ఫౌంటైన్​ని తీసుకొచ్చారు. చాలా కంపెనీలు వీటిని అమ్ముతున్నాయి. ఇవి సోలార్​ పవర్​తో పనిచేస్తాయి. ఇంటి బయట తక్కువ ప్లేస్​ ఉన్నా పెట్టుకోవచ్చు. 

ఇందులో స్ర్పే ప్యాట్రెన్​ని అడ్జెస్ట్​ చేసుకోవచ్చు. ప్యాక్​లో 8 రకాల నాజిల్స్ వస్తాయి. ఫౌంటైన్​కు విజువల్ ఎఫెక్ట్స్​ ఇవ్వడానికి దీనికి ప్రత్యేకంగా లైట్లు ఉంటాయి. దీన్ని ఇన్​స్టాల్​ చేయడం కూడా ఈజీ. తరోజులో కాసేపు ఎండ తగిలినా పనిచేస్తుంది. ఇందులో 2.5W బర్డ్ బాత్ ఫ్లోటింగ్ సోలార్ ఫౌంటైన్ పంప్‌  ఉంటుంది. రాత్రి పనిచేయడానికి కావాల్సిన పవర్​ని బ్యాటరీలో స్టోర్ చేసుకుంటుంది. పూర్తి ఛార్జ్ కావడానికి 2–3 గంటలు సన్​ లైట్​ ఉంటే సరిపోతుంది.

ధర : 1,299 రూపాయలు