మంథనిని పర్యాటక కేంద్రంగా మారుస్తా

  • విద్యారంగంలోనూ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి
  • ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు

పెద్దపల్లి/మంథని, వెలుగు : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, విద్యారంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం అర్జీ త్రీ ఏరియా పరిధిలో ఎకో పార్క్ నిర్మాణానికి సోమవారం భూమిపూజ, శంకుస్థాపన చేశారు. మంథని పట్టణంలో ఎన్టీపీసీ సీఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ సహకారంతో రోహిణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు మాట్లాడుతూ సింగరేణి కాలనీల్లో కార్మికులు, వారి పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఎకో పార్క్‌‌‌‌‌‌‌‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. గోదావరిఖని మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఏడు శాతం రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యపరమైన మంథని లక్ష్యంతో అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు. మంథని మండలం ఖానాపూర్‌‌‌‌‌‌‌‌ వద్ద ఎల్‌‌‌‌‌‌‌‌ మడుగులో ఉన్న క్రోకోడైల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లేందుకు రూ. 7 కోట్లతో రోడ్డును మంజూరు చేశామన్నారు. అనంతరం మంథని మార్కెట్‌‌‌‌‌‌‌‌ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. 

అస్వస్థతకు గురైన స్టూడెంట్లను పరామర్శించిన మంత్రి

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని కస్తూరిబా స్కూల్‌‌‌‌‌‌‌‌లో అస్వస్థతకు గురై ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్న చిన్నారులను మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు పరామర్శించారు. పేరెంట్స్‌‌‌‌‌‌‌‌ ఎవరూ ఆందోళన చెందొద్దని, స్టూడెంట్లకు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు 10 మంది డాక్టర్లు, 20 మంది స్టాఫ్‌‌‌‌‌‌‌‌ నర్సులతో స్పెషల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. కస్తూర్బా స్కూల్‌‌‌‌‌‌‌‌ పక్కన ఉన్న డంప్‌‌‌‌‌‌‌‌ యార్డ్‌‌‌‌‌‌‌‌ను వెంటనే తొలగించాలని ఆఫీసర్లను ఆదేశించారు. స్టూడెంట్ల అస్వస్థతకు కారణాలు తెలుసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. స్టూడెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వోను ఆదేశించారు.