నేషనల్ లెవల్ ఒలంపియాడ్ లో .. మానేర్ స్టూడెంట్ కు ఫస్ట్ ర్యాంకు

కరీంనగర్ టౌన్,వెలుగు :  జాతీయస్థాయిలో సెమ్స్‌‌‌‌ ఒలంపియాడ్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ ఆధ్వర్యంలో  నేషనల్‌‌‌‌ సెమ్స్‌‌‌‌ ఒలంపియాడ్‌‌‌‌ లో     మానేరు స్కూల్​ కు చెందిన 9వ తరగతి విద్యార్థి  ఎ.ఆత్రేయకు ఫస్ట్ ర్యాంకు  వచ్చిందని  చైర్మన్ కడారి అనంతరెడ్డి అన్నారు. సోమవారం మానేర్ స్కూల్ లోస్టూడెంట్స్​ను   అనంతరెడ్డి  అభినందించారు.

 ఆత్రేయతో పాటు టెన్త్ క్లాస్ కాజల్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు, సాయిమానేర్   9వ తరగతి లాస్యప్రియ సైతం స్టేట్ ఫస్ట్ ర్యాంకు , వహీదున్నీసా నేషనల్‌‌‌‌ లెవల్ 2వ ర్యాంకు సాధించగా, దీక్షిత్,  పరీక్షిత్ సారథి  స్టేట్ 2వ ర్యాంకు, అక్షయ, అరవింద్ రెడ్డి, సంజన్ తేజ్  స్టేట్ లో 3వ ర్యాంకు సాధించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కడారు సునీతరెడ్డి, కడారి కృష్ణారెడ్డి, ప్రిన్సిపల్, టీచర్స్,పేరెంట్స్, స్టూడెంట్లు పాల్గొన్నారు.