మన్మోహన్​ సంస్కరణలతో దేశాభివృద్ధి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్​తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలతో దేశం పురోగమనం చెందిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్ సంతాప దినాల్లో భాగంగా జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​లో కాంగ్రెస్​ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయన ఫ్లెక్సీకి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మన్మోహన్​సింగ్​కు భారతరత్న అవార్డు ప్రకటించాలని డిమాండ్​చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ మారజోడు రాంబాబు, ఏఎంసీ చైర్​పర్సన్​ జూలుకుంట్ల లావణ్యాశిరీశ్​రెడ్డి, కాంగ్రెస్​జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు