శ్రీకృష్ణుడు... ద్రౌపదికి చెప్పిన వ్రతం గురించి తెలుసా...

 శ్రావణ మాసంలో వచ్చే  మంగళవారాలు ఎంతో ప్రత్యేకమైనవి. మంగళవారం రోజున  మంగళ గౌరీ పూజలను చేయాలి. మంగళ గౌరీ అంటే ఎవరో కాదు.. సాక్షాత్తు పార్వతీదేవి. ఈ దేవినే మంగళగౌరీగా పిలుస్తారు. మంగళగౌరి వ్రతం ఎందుకు ఆచరించాలి.. ద్రౌపదికి.. శ్రీకృష్ణుడు వివరించిన వ్రతం ఏమిటి... ఆ వ్రతాన్ని  ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి... మంగళ గౌరీ వ్రతం కథ గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

శ్రావణమాసంలో మంగళవారం ... మంగళగౌరీ  వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 'ఐదోతనం' జీవితాంతం నిలుస్తుందని పండితులు చెబుతుంటారు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడు ...ద్రౌపదికి వివరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది... 

పురాణాల ప్రకారం.. పూర్వ కాలంలో ధర్మపాలుడనే అనే వ్యక్తి వద్ద అపారమైన సంపద, ఉండేది. తనకు అందమైన భార్య కూడా ఉండేది. వారి దగ్గర ఎంత డబ్బు, బంగారం, వజ్ర వైడూర్యాలు ఉన్నప్పటికీ వారి వంశానికి ఒక్క వారసుడు కూడా లేడు. వారు ఎంత ప్రయత్నించినా సంతానం కలగలేదు. దీంతో వారు చాలా బాధపడుతుండేవారు. భర్త అనుమతితో.. ఒకరోజు తన ఇంటికి వచ్చిన బిచ్చగాడికి తన భర్త అనుమతితో జోలేలో బంగారం వేసింది.  దీంతో తను ఆగ్రహించి ఆమెకు సంతానం కలగకూడదనే శాపం పెట్టాడట. 
పూర్వకాలంలో బిచ్చగాళ్లు.. కేవలం పొట్ట నింపుకొనేందుకు కావలసిన ఆహారం కోసం మాత్రమే భిక్షాటన చేసేవారు.  మిగతా సమయంలో ఒక నిర్మానుష్య... చాలా సైలంట్​ గా ఉన్న ప్రాంతం వైపు వెళ్లి.. తపస్సు చేసుకొనేవారు.  ఇలా వారికి దైవశక్తి కూడా ఉండేదని రుగ్వేదంలో చెప్పబడింది. దీంతో ఆ దంపతులు ఆ బిచ్చగాడిని  ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతన్ని పెళ్లాడే అమ్మాయి తల్లి మంగళ గౌరీ వ్రతం చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావం వల్ల నీ కుమారుడు మరణించడని, తను విధవ అవ్వదని సూచించాడు. 

పదహారేళ్ల వయసులో..

 కొంతకాలానికి  వారికి సంతానం కలుగుతుంది. తమ కుమారుడికి పదహారేళ్లు వయసు రాగానే కాశీకి వెళ్లే సమయంలో వీరికి మార్గం మధ్యలో దైవలీల ఫలితంగా మంగళ గౌరీ వ్రతాన్ని చేసిన తల్లి ‘సుశీల' అనే కన్య కనబడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారునికి వివాహం జరిపిస్తారు. ఆమె సహచర్యంతో భర్తకు పదహారేళ్ల అకాల మరణం ఉన్నా.. ‘మంగళ గౌరీ' వ్రత వాయనం తీసుకున్న కారణంగా భర్తకు పూర్తి ఆయుష్ లభిస్తుంది.

 శ్రావణ మాసంలో.. 

 మంగళ గౌరీ వ్రతం అంతా శ్రావణ మాసంలోనే జరుగుతుంది. అందుకే అప్పటి నుండి శ్రావణ మంగళ గౌరీ వ్రతానికి ఎంతో విశిష్టత ఏర్పడింది. ఈ వ్రతా చరణ వల్ల స్త్రీలకు వైధవ్యం రాదని.. పుణ్య స్త్రీలుగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. మంగళగౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ ఆచరించాలి. అదే సమయంలో మహానివేదనలో పూర్ణం ఉన్న కుడుములు, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. 

సాయంత్రం సమయంలో..

 వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువులను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి. ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొనదగింది తోరపూజ. పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు. ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని ( పూలు) కడతారు. ఈ తోరాలను గౌరీ దేవి ముందు పెట్టి పూజ చేసి ఒక తోరాన్ని కట్టుకుంటారు. రెండో తోరాన్ని ముత్తైదువుకు ఇస్తారు. మూడో తోరాన్ని గౌరీ దేవికి సమర్పిస్తారు. ఈ విధంగా మంగళ గౌరీ వత్రం చేస్తే మంచి ఫలితం వస్తుంది. చివరగా వ్రతం మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే.. ఆ వ్రతాన్ని తరువాతి సంవత్సరం కొనసాగించాలి. చివరగా ఉద్యాపన చేసిన వ్రతాన్ని ముగించాలి.