మధ్యలోనే ఆగిన మానేరు రివర్‌‌ ఫ్రంట్‌‌ పనులు

  • నిధుల్లేక నిలిచిన హరిత హోటల్‌‌
  • కేబుల్‌‌ బ్రిడ్జిపై వెలగని లైట్లు
  • ముందట పడని కరీంనగర్‌‌ టూరిజం ప్రాజెక్ట్‌‌లు

కరీంనగర్, వెలుగు :ఉమ్మడి కరీంనగర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో టూరిజం ప్రాజెక్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల అభివృద్ధి ఒకడుగు ముందుకు..రెండడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. నిధుల లేమితో కొన్ని పనులు ఆగిపోగా, కోర్టు స్టేలతో మరికొన్ని నిలిచిపోయాయి. నిర్వహణ లోపంతో ఇంకొన్ని టూరిస్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పాట్లు కళావిహీనంగా మారుతున్నాయి. 

కరీంనగర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిరుడు అట్టహాసంగా ప్రారంభించిన కేబుల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జిపై లైట్లు వెలగడం లేదు. రాత్రయితే బ్రిడ్జిపై అంధకారం అలుముకుంటోంది. దీంతో కరీంనగర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాసులకు లోయర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానేరు డ్యామ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉజ్వల పార్కు తప్ప మరో ఆహ్లాదకర ప్రాంతమే లేకుండా పోయింది.  

ఎన్జీటీ స్టేతో ఆగిన మానేరు రివర్ ఫ్రంట్ పనులు

కరీంనగర్ నగరానికి పర్యాటక శోభను తీసుకొచ్చేందుకు మానేరు రివర్ ఫ్రంట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గత సర్కార్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించింది. మాజీమంత్రి, బీఆర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రీమ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన ఈ రివర్ ఫ్రంట్ పనులకు సంబంధించి ఫస్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 90 శాతం పనులు పూర్తయ్యాయి. 

మరో రూ.100 కోట్లతో వ్యూయింగ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యాలరీ, ఎంట్రీ ప్లాజా, మ్యూజికల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫౌంటేయిన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రామగుండం – హైదరాబాద్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైపాస్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు నుంచి బండ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు ఫార్మేషన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు, ల్యాండ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కేపింగ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇల్యూమినేషన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాత్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేలు ఏర్పాటు చేయాల్సి ఉంది. 

ఇందుకు సంబంధించిన సెకండ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులకు ఇటీవల ప్రభుత్వం గ్రీన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిగ్నల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి నేషనల్ గ్రీన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించడంతో ఎన్జీటీ చెన్నై బెంచ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర టూరిజం, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు నివేదిక సమర్పించినప్పటికీ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆఫీసర్లు ఇప్పటివరకు రిపోర్టులు సమర్పించకపోవడంతో గ్రీన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసును మళ్లీ వాయిదా వేసింది.

 డిసెంబర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2లోగా సంబంధిత శాఖలతో పాటు ఇరిగేషన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ కూడా రిపోర్టును సమర్పించాల్సి ఉంది. ఈ రిపోర్టులపై ఎన్జీటీ చెన్నై బెంచ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంతృప్తి చెంది స్టే ఎత్తేస్తేనే పనులు ముందుకు సాగనున్నాయి. 

నిలిచిపోయిన హరిత హోటల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణం

కరీంనగర్ ఎన్టీఆర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంక్షన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలో ఉజ్వల పార్కు రోడ్డులో చేపట్టిన హరిత హోటల్, రెస్టారెంట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులు చివరి దశలో నిధుల్లేక గత ప్రభుత్వ హయాంలోనే నిలిచిపోయాయి. ఈ హోటల్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే పర్యాటకులకు బడ్జెట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటల్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుబాటులోకి రానుంది. టూరిజం కార్పొరేషన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ఇప్పటికే ఈ హోటల్ నిర్మాణం పూర్తి చేయడానికి కావాల్సిన నిధులతో ప్రపోజల్స్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపినట్లు తెలిసింది. 

రూ.కోటితో కొన్న పడవను పక్కన పడేసింన్రు

టూరిస్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం కరీంనగర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోయర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానేరు డ్యామ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరేండ్ల కింద బోటింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. మానేరు డ్యామ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూసేందుకు వచ్చే కరీంనగర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీతో పాటు చుట్టుపక్కల ప్రజలు బోటింగ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం స్పీడ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోటు, డీలక్స్ బోట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉన్నాయి. ఏడాదిన్నర కింద ఒకేసారి ఎక్కువ మంది టూరిస్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ప్రయాణించేలా రూ. కోటి పెట్టి క్రూయిజ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేశారు. 

ఈ క్రూయిజ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ప్లాట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించకపోవడంతో ఈ పడవ వినియోగంలోకి రాలేదు. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టంతో లోయర్ మానేరు డ్యామ్ నిండుకుండలా మారింది. డ్యామ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జలాల అలలను ఆస్వాదించేందుకు సాయంత్రమైతే భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఉన్న రెండు బోట్లు సరిపోవడం లేదు. 

క్రూయిజ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తీసుకొస్తే ఉపయోగకరంగా ఉండడంతో పాటు టూరిజం డిపార్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉండనుంది. సిరిసిల్లలోని మిడ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానేరు బ్యాక్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గతేడాది అప్పటి మంత్రి కేటీఆర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించిన బోటింగ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్క రోజుకే ఆగిపోయింది. 

చారిత్రక స్థలాలపైనా నిర్లక్ష్యమే..

కరీంనగర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని ఎలగందుల ఖిల్లా వైభవాన్ని కండ్లకు కట్టేలా ఈ తరానికి తెలిసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3.13 కోట్లతో ఏర్పాటు చేసిన ‘సౌండ్ అండ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షో’ మూలనపడింది. 40 నిమిషాల నిడివితో రూపొందించిన చిన్న సినిమాను భారీ తెరపై ప్రదర్శించేవారు. ప్రస్తుతం స్క్రీన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిరిగిపోగా స్పీకర్లు పనిచేయడం లేదు. పర్యవేక్షణ లేకపోవడంతో లైట్లు విరిగిపోయాయి. 

ఖిల్లా పరిసరాలు కూడా చెట్లతో నిండిపోయి అడవిని తలపిస్తున్నాయి. అలాగే పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని ప్రాచీన ధూళికట్ట బౌద్ధస్తూపాన్ని టూరిస్ట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పాటగా డెవలప్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది.