బాల్కొండ ఖిల్లా అభివృద్ధికి చర్యలు

బాల్కొండ, వెలుగు : నిజామాబాద్ జిల్లా  బాల్కొండ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. సోమవారం మండల స్థాయి ఆఫీసర్లు ఖిల్లాలోని పురాతన కట్టడాలను పరిశీలించి, చేపట్టే పనుల గురించి  అడిగి తెలుసుకున్నారు.1059లో ఏర్పడ్డ నాటి అల్లకొండను పర్యాటక కేంద్రంగా గుర్తించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమతుకు ఖిల్లా పరిరక్షణ సమితి పలుమార్లు విజ్ఞప్తి చేసింది.  

దీంతో మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం కింద ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆఫీసర్లను కలెక్టర్​ ఆదేశించారు. బాల్కొండ పంచాయతీ ఆఫీస్ నిర్వహించిన గ్రామసభలో ఖిల్లా పర్యాటక అభివృద్ధిపై చర్చించారు.  కార్యక్రమంలో ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, ఏపీవో ఇందిర, ఇన్​చార్జి పంచాయతీ ఆఫీసర్ ప్రభాకర్

అల్లకొండ ఖిల్లా పరిరక్షణ సమిటీ ప్రెసిడెంట్ భూసం సత్యనారాయణ, వర్కింగ్ చైర్మన్  నర్సింగ్ రావు, జాయింట్ సెక్రటరీలు ఎస్. సంతోశ్​కుమార్, నవీన్ కుమార్, డి.పవన్,  నరేశ్​ కుమార్, గౌరు శివానంద్ తదితరులు పాల్గొన్నారు.