మంత్రి తుమ్మలను కలిసిన మోహన్​రెడ్డి

నిజామాబాద్, వెలుగు : రాష్ట్ర సహకార సంఘాల అభివృద్ధి కార్పొరేషన్​ చైర్మన్​గా నియమితులైన డీసీసీ ప్రెసిడెంట్​మానాల మోహన్​రెడ్డి మంగళవారం మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర​రావును హైదరాబాద్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ను కలిసి జిల్లాలోని భీంగల్​ఆర్టీసీ బస్​ డిపోను పునరుద్ధరించాలని ఆయన కోరారు.