ఎంపీ అర్వింద్ పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం : ​మానాల మోహన్​రెడ్డి

నిజామాబాద్​, వెలుగు: పార్లమెంట్​ ఎలక్షన్​లో ఓటమి ఖాయంగా భావించి బీఆర్​ఎస్​ సహకారంతో అనూహ్యంగా గెలిచిన ఎంపీ అర్వింద్​కు మళ్లీ అహంకారం మొదలైందని డీసీసీ ప్రెసిడెంట్​, రాష్ట్ర సహకార యూనియన్​ లిమిటెడ్​ చైర్మన్​ మానాల మోహన్​రెడ్డి ఆరోపించారు.  ఎన్నికలలో గెలవడానికి డ్వాక్రా సంఘాలకు ఉద్యోగులతో చేయించిన పైసల పంపిణీ వీడియో రికార్డులు తమ దగ్గర ఉన్నాయని వాటిని ఎలక్షన్​ కమిషన్​కు అందించబోతున్నామన్నారు.  గురువారం ఆయన డీసీసీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు.

నీతి నిజాయతీని నమ్ముకొని దశాబ్దాల కాలంగా బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి పాలిటిక్స్​లో కొనసాగుతున్నారన్నారు. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం హెచ్చరికలకు పాల్పడడం ఏమిటన్నారు. మంత్రిగా పనిచేసిన కాలంలో సుదర్శన్​రెడ్డి మెడికల్​ కాలేజీ తెచ్చారని, అలీసాగర్​ లిఫ్టు ఇరిగేషన్​ నిర్మించి జిల్లా రైతులకు మేలు చేశారన్నారు. జిల్లా డెవలెప్​మెంట్​ ఆయన రోల్​ చాలా ఉందన్నారు.  ఒక్క లెటర్​ ఇస్తే సెంట్రల్​ నుంచి ఫండ్స్​ తెస్తానంటున్న అర్వింద్​ గడిచిన ఐదేండ్లు ఎంపీగా ఏం చేశారో చెప్పాలన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్​తాహెర్​, టీపీసీసీ జనరల్​సెక్రెటరీ గడుగు గంగాధర్​,  నగర పార్టీ ప్రెసిడెంట్​ కేశ వేణు, అంతిరెడ్డి రాజిరెడ్డి, నరాల రత్నాకర్​, వేణురాజ్​ తదితరులు ఉన్నారు.