299 క్వింటాళ్ల రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యం పట్టివేత

మానకొండూర్, వెలుగు: లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యంను మానకొండూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు, కరీంనగర్ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బంది శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. సీఐ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ సిటీలోని కరీమాబాద్ కు చెందిన తడక సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పోచమ్మ మైదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన జన్ను అనిల్.. సుమారు 299 క్వింటాళ్ల రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యాన్ని లారీలో నాందేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలిస్తున్నారు. 

శుక్రవారం రాత్రి మానకొండూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా లారీ అనుమానాస్పదంగా కనిపించింది. డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్లీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకొని స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. విచారణలో రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. తడక సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  లారీ డ్రైవర్ జమిల్ సయ్యద్ అహ్మద్, క్లీనర్ విటల్ కుషాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.